News August 22, 2025
ఈనెల 23న స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్రను విజయవంతం చేయండి: కలెక్టర్

ఈనెల 23న నిర్వహించే స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్రలో ‘మాన్సూన్ హైజీన్’ థీమ్‌తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డ్వామా, డీపీఓ అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News August 23, 2025
జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోంది: కలెక్టర్

జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2024కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.
News August 22, 2025
2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ను సాధిద్దాం: డీఎంహెచ్ఓ

కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో జిల్లా స్థాయిలో 5 సూచికలు, మండల స్థాయిలో 18 అభివృద్ధి సూచికలు ఉన్నాయని, వీటి ప్రగతిని ప్రోగ్రాం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ డా.శాంతి కళ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ లక్ష్యాలను సాధించేందుకు పనిచేద్దామన్నారు.
News August 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25, 26వ తేదీలలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపర్చిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, Annexure-I (Revised Attestation Form) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకుని రావాలన్నారు.