News October 21, 2025
ఈనెల 23న 10 కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 కార్పొరేట్ కంపెనీలు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
Similar News
News October 21, 2025
తణుకు: ఇరు వర్గాల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు

తణుకు మండలం తేతలిలో సోమవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. వివాదం తీవ్రమై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్ఐ కె. చంద్రశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 21, 2025
VSUలో కరెంట్ కట్.. విద్యార్థులకు సెలవు

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్‌లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.
News October 21, 2025
రేపటి నుంచే కార్తీక మాసం

ఇవాళ్టితో ఆశ్వయుజ మాసం ముగిస్తుంది. రేపటి(OCT 22) నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్ర వేళల్లో దీపాలు వెలిగిస్తూ, పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, వనభోజనాలతో ఈ మాసమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.