News August 13, 2025

ఈనెల 25న వర్ధన్నపేటలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

image

ఈనెల 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండవ విడత పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 25న సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్రతో నియోజకవర్గంలోకి చేరుకుంటారని, 26న ఉదయం 7 నుంచి 10 గంటల వరకు శ్రమదానం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10:30కు వరంగల్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా, పాదయాత్ర రూట్ ఖరారు కావాల్సి ఉంది.

Similar News

News August 13, 2025

డోర్నకల్ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

image

డోర్నకల్ మీదుగా నడిచే పలు రైళ్లను ట్రాక్ మరమ్మతులు, మెయింటినెన్స్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో DKJ-VIJ (67767), VIJ-DKJ (67768), VIJ-SEC (12713), VIJ-BCM(67215), GUNTOR-SEC(12705), SEC-GUNTR(12706) రైళ్లు ఉన్నాయి. ఈనెల 14 నుంచి 5 రోజుల పాటు రద్దు వర్తిస్తుందని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

News August 13, 2025

రూ. 56 లక్షల ఆస్తులు అటాచ్ చేశాం: SP

image

ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన గంజాయి కేసులు అరెస్ట్ అయిన ఒడిశా వాసి నగేశ్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్తులను గుర్తించామని, రూ.56 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్‌కత్తా అథారిటీ పరిధిలో ఉన్నాయని, ఎవరు కొనుగోలు చేసినా చెల్లవన్నారు.

News August 13, 2025

కాసిపేట: అప్పుల బాధకు లారీ డ్రైవర్ ఆత్మహత్య

image

కాసిపేట మండలం సోమగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ MD.రంజాన్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని SI ఆంజనేయులు తెలిపారు. లారీ నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్న రంజాన్ కొత్త లారీ కొని అప్పుల పాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో ప్రమాదం జరిగింది. కుటుంబీకులతో చెప్పి బాధపడుతూ మానసికంగా కుంగిపోయి ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.