News March 19, 2025
ఈనెల 26 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

రాజంపేట మండలం తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ అధికారిని హేమలత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, సప్తగిరిల సంకీర్తన, గోష్టి గానం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, శ్రీరామ పాదుకలు నాటకం ఉంటుందని తెలిపారు.
Similar News
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
మత్స్యకార కుటుంబాలకు పరిహారం: ఎంపీ తంగెళ్ల

చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కాకినాడలో ఆయన మాట్లాడారు. ఏడేళ్లలో జిల్లాలో 18 మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించారని చెప్పారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వారికి తక్షణమే పరిహారం విడుదల చేయాలని అధికారులను కోరారు.
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.