News December 24, 2024
ఈనెల 27న ధర్నా చేస్తాం: విజయసాయిరెడ్డి
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 25, 2024
జాబ్‌కు రిజైన్ చేసి రాజకీయాల్లోకి..!
ప్రకాశం జిల్లాలో జన్మించిన కంభంపాటి హరిబాబు AUలో బీ.టెక్, PHD పూర్తి చేసిన అనంతరం అదే యూనివర్సీటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. BJPలోని పలు పదవుల్లో సేవలంది 1999లో విశాఖ-1 MLAగా, 2014లో విశాఖ MPగా గెలిచారు. 2021లో మిజోరం గవర్నర్‌గా నియమింపబడ్డ ఆయన తాజాగా ఒడిశా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. కాగా.. ఆయనకు ఇటీవల హార్ట్ సర్జరీ అయ్యింది.
News December 25, 2024
ఎస్.రాయవరం: పేకాట ఆడుతూ పట్టుబడిన మహిళలు
ఎస్.రాయవరం మండలం సీతారాంపురంలో పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. ఎస్ఐ విభీషణరావు ఆధ్వర్యంలో మహిళ కానిస్టేబుల్‌తో కలిసి నిర్వహించిన దాడుల్లో రూ.67 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, ఏడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 25, 2024
వైసీపీ తటస్థంగా ఉంటుంది: విజయసాయిరెడ్డి
రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. తాము ఎన్డీఏ లేదా ఇండియా కూటమి పక్షం కాదని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ తటస్థంగా ఉంటుందన్నారు. 2027లో జమిలి ఎన్నికలకు పార్లమెంట్‌లో బిల్లు పెడతారని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. దీనిపై వేసిన జెపీసీలో తాను సభ్యుడిగా ఉన్నానన్నారు.