News August 26, 2025
ఈనెల 28నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు: SP

కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారికి ఈనెల 28 నుంచి కైలాసగిరి ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో వైద్య పరీక్షలు జరుగుతాయని SP తుహీన్ సిన్హా తెలిపారు. హాల్ టికెట్ నంబర్ 4001020 నుంచి 4152205 వరకు గల అభ్యర్థులు 28న, 4152904-4275272 వరకు గల అభ్యర్థులు 29న హాజరు కావాలన్నారు. అలాగే 4276418-4507457 వరకు గల అభ్యర్థులు ఈనెల 30న రావాలన్నారు. ఆయా రోజుల్లో హాజరు కాలేని వారు సెప్టెంబర్ 1న హాజరు కావాలన్నారు. >Share it
Similar News
News August 26, 2025
GWL: ‘మండపాలు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి’

గణేష్ మండపాలు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎలాంటి అపశృతి జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గణపతి దర్శనానికి వచ్చే మహిళలపై ఈవ్ టీజింగ్ జరగకుండా జాగ్రత్త వహించాలని, డీజేలు వాడరాదని, రాత్రి లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
News August 26, 2025
మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించాలి: కలెక్టర్

మహిళలు వివిధ రంగాలలో స్వయం ఉపాధి పొందేలా అవసరమైన శిక్షణలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సారంగాపూర్ మండలం చించోలి సమీపంలోని మహిళా ప్రాంగణంలో జరుగుతున్న శిక్షణలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
News August 26, 2025
NZB: మహిళా, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

మహిళా, శిశు సంక్షేమం కోసం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, సంపూర్ణ లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. నూతనంగా మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.