News March 26, 2025

ఈనెల 28న ఏలూరు కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు

image

ఏలూరు కలెక్టరేట్ గిరిజన భవన్‌లో ఈనెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా.. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఆమె పేర్కొన్నారు. కనుక ఏలూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు, ఇఫ్తార్ విందుకు రావాలని కలెక్టర్ కోరారు.

Similar News

News December 22, 2025

రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్ వార్తల్లో వాస్తవం లేదు: గోవర్ధన్

image

రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చీఫ్ వార్డెన్ డాక్టర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం బి- హాస్టల్లో, హాస్టల్ డే నిర్వహించారని, అందులో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా తినడంతో అజీర్తి అయిందన్నారు. వారికి చికిత్స అందించారు అంతకుమించి ఎలాంటి ఇబ్బంది లేదని, విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దన్నారు.

News December 22, 2025

VZM: నాన్నమ్మను హత్య చేసిన మనవడు

image

భోగాపురం మండలం ముడసలపేట గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నాన్నమ్మను హత్య చేసిన మనవడు ముడసల గౌరి (27)ను అరెస్టు చేసినట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు.మద్యం మత్తులో నిందితుడు నాన్నమ్మ అప్పయ్యమ్మను హత్య చేసి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడి వద్ద నుంచి 18.250 గ్రాముల బంగారు వస్తువులు, 106 గ్రాముల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

News December 22, 2025

VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం

image

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నామని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.