News January 20, 2025
ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు.
Similar News
News January 19, 2025
భూపాలపల్లి: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్
రైతుభరోసా, నూతన రేషన్ కార్డులు విచారణ ప్రక్రియలో జిల్లా, మండలస్థాయి అధికారులు భాగస్వాములైనందున ఈనెల 20న (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు ప్రజావాణి తాత్కాలిక రద్దుపై ఆదివారం ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి జరుగనున్న గ్రామసభల నిర్వహిస్తామన్నారు.
News January 19, 2025
భూపాలపల్లి: వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
రేగొండ మండలం లింగాల గ్రామం, గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేటలో జరుగుతున్న పథకాల సర్వే ప్రక్రియను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీ, పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. రైతులు, పథకాల లబ్ధిదారులు ఈ ప్రక్రియ ద్వారా తమకు అందే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News January 19, 2025
ముగిసిన మావోయిస్టు దామోదర్ ప్రస్థానం!
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్@ <<15194613>>చొక్కారావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్థానం ముగిసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాల్వపల్లికి చెందిన దామోదర్ గోవిందరావుపేట కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.