News February 27, 2025

ఈనెల 28న సైన్స్ కార్యక్రమాలు నిర్వహించాలి: DEO

image

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 28న పెద్దపల్లి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో సృజనాత్మకత సైన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని DEO మాధవి తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు, సైన్స్ శాస్త్రవేత్తలు- వారి ఆవిష్కరణ, ప్రయోగ ప్రదర్శనలు తదితర అంశాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావును సంప్రదించాలన్నారు.

Similar News

News January 1, 2026

ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 1, 2026

బాపట్ల: కొత్త ఏడాదైనా ‘కంది’ కరుణించేనా..?

image

కొరిశపాడు మండలంలోని 43 చౌకధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ గురువారం మొదలవగా, కందిపప్పు సరఫరాపై ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. గత సంవత్సరం తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం నుంచి కందిపప్పు ఆశించిన స్థాయిలో అందలేదని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కొత్త ఏడాదిలోనైనా అందిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంక్రాంతికి కిలో గోధుమ పిండిని రూ.20కే సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

News January 1, 2026

డ్రంకెన్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

image

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్‌లో 928, ఫ్యూచర్ సిటీ‌లో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్‌గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.