News December 28, 2025
ఈనెల 29న సంగారెడ్డిలో ‘జాబ్ మేళా’

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 29న సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 28, 2025
గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’కు మంత్రి సీతక్క

TG: జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లోని <<18631208>>గాదె ఇన్నయ్య <<>>నిర్వహిస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఇన్నయ్యను మిస్ అవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న పిల్లలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకు, బసకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాగరం గ్రామంలోని ఇన్నయ్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.
News December 28, 2025
విశాఖ: ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్.. 75%కి పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గాజువాక, స్టీల్ సిటీ డిపోలను శనివారం తనిఖీ చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకంతో జిల్లాలో మహిళా ప్రయాణికుల సంఖ్య 75%కి పెరిగిందని, దీనివల్ల టికెట్ మిషన్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కండక్టర్లకు 20,000 mAh పవర్ బ్యాంక్స్ పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎంఈ గంగాధర్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News December 28, 2025
స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్స్ లిస్ట్‌లో స్మృతి మంధాన కంటే ముందు IND-మిథాలీ రాజ్(10,868), NZ-సుజీ బేట్స్(10,652), ENG-షార్లెట్(10,273) ఉన్నారు.


