News December 27, 2025

ఈనెల 29న సిద్దిపేట కలెక్టరేట్‌లో ప్రజావాణి: కలెక్టర్

image

ఈ నెల 29న సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీదారులు నేరుగా వచ్చి తమ వినతులను సమర్పించవచ్చని ఆమె పేర్కొన్నారు.

Similar News

News December 30, 2025

భువనగిరి: గ్రీవెన్స్‌ డే రద్దు

image

గురువారం జరగాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దయినట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ వర్గాల ప్రజలు, అధికారులు కలెక్టరేట్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గురువారం ఫిర్యాదుల కోసం కార్యాలయానికి రావొద్దని ప్రజలను కోరారు. తదుపరి గ్రీవెన్స్ షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News December 30, 2025

గద్వాల: యూరియాకు కొరత లేదు: కలెక్టర్‌

image

గద్వాల జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, కొరత ఉందన్న వార్తల్లో నిజం లేదని కలెక్టర్‌ సంతోష్‌ మంగళవారం స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5,816 మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ చేశామని, ఇంకా 8,124 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, బారులు తీరాల్సిన అవసరం లేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News December 30, 2025

అద్దంకి: ‘డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి’

image

అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, చిత్తూరు కడప, అనంతపురానికి 50 కేజీల బరువు ఉన్న పార్సిళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందని డీఎం రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. పట్టణ పరిధిలో 10 కిలోమీటర్ల వరకు ఈ సౌకర్యం ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.