News December 28, 2024
ఈనెల 29న NZBకు ఎమ్మెల్సీ కవిత

NZB ఎమ్మెల్సీ కవిత ఈనెల 29న నిజామాబాద్‌కు వస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. 29న ఉదయం HYD నుంచి బయలుదేరి నిజామాబాద్‌కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డిచ్‌పల్లి వద్ద BRS పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాశ్‌నగర్ SFS సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు.
Similar News
News September 13, 2025
NZB: హైకోర్టు జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వారితో భేటీ అయ్యారు. జడ్జీలు నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శిచగా కలెక్టర్ వారితో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
News September 13, 2025
SRSPకి వరద.. 22 గేట్ల ద్వారా నీరు విడుదల

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఎగువ నుంచి 82,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 22 వరద గేట్ల ద్వారా 64,680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. IFFC ద్వారా 8 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 800, ఎస్కెప్ గేట్ల ద్వారా 8,000, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
News September 13, 2025
NZB: వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 3 ఏళ్ల జైలు

వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి NZB 4వ అడిషనల్ మహిళ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. రెంజల్ మండల కేంద్రానికి చెందిన గైని కిరణ్ 2023 ఏప్రిల్ 14న పక్క ఇంట్లో నివసించే వివాహిత ఒంటరిగా ఉండగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడికి చేరుకుని కిరణ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు.