News January 1, 2025

ఈనెల 3న చలో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్ కృష్ణయ్య

image

విద్యార్థుల ఫీజుల బకాయిలను వెంటనే చేల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్‌లో ఈ ముట్టడికి సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి గత 2ఏళ్లు ఫీజుల బకాయిలు రూ. 4వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 4, 2025

HYDకు వచ్చే మంచినీరు ఈ నదుల నుంచే..!

image

నగరానికి ప్రస్తుతం మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని జలమండలి తెలిపింది. గోదావరి ఫేజ్-2 ద్వారా మరిన్ని నీటిని తరలించి ఉస్మాన్‌సాగ‌ర్‌, హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టు రూపు దిద్దుకుంటుందని పేర్కొంది. మరోవైపు జలమండలి నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఆదాయం పెంచడంపై దృష్టి సారించనుంది.

News January 4, 2025

HYDలో 13.79 లక్షల వాటర్ కనెక్షన్లు..!

image

ప్రస్తుతం HYD జనాభాకు సరిపడేలా తాగునీటి సరఫరా చేస్తున్నామని జలమండలి అధికారులు తెలిపారు. నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9,800 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో 13.79 లక్షల కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు సీఎం సమావేశంలో అధికారులు వివరించారు. పలు అంశాలపై ఏజెన్సీలు, కన్సల్టెన్సీ‌లతో అధ్యయనం జరిపించనున్నారు.

News January 4, 2025

HYD: RRR భూ సేకరణ పూర్తి చేయండి: CM

image

HYD ORR చుట్టూ నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర మణిహారంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. RRR భూ సేకరణలో అటవీ భూముల్లో ఉన్న సమస్యలపై సంబంధిత మంత్రితో సమన్వయంతో ముందుకెళ్లాలని, ప్రత్యేక సమావేశంలో సీఎం తెలిపారు.