News March 23, 2025
ఈనెల 30న కృష్ణా జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈనెల 30వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరుకానున్నారు.
Similar News
News March 24, 2025
కృష్ణా: ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు- DRO

ఈ నెల 25వ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ చంద్రశేఖరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం తన ఛాంబర్‌లో ఆయన సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పెడనలో 1, పెనమలూరులో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
News March 24, 2025
MTM: పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి – కలెక్టర్

మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 19,839 అర్జీలు అందగా అందులో ఇంకా 2,235 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలన్నారు.
News March 24, 2025
కృష్ణాజిల్లాలో పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

కృష్ణాజిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 21,771 మంది విద్యార్థులకు గాను 21,419 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.