News March 28, 2025

ఈనెల 30 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రారంభం

image

భద్రాచలంలో జరిగే శ్రీ రామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ www.bhadradritemple. telangana.gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని ఆలయం ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు పంపిస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 31, 2025

SRH.. బౌలింగ్‌‌లో రైజ్ అవ్వరా?

image

గత సీజన్లో భారీ స్కోర్లతో అలరించిన SRH ఈ సారి రెట్టించి ఆడుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచులో అంచనాలను అందుకున్నా తర్వాతి రెండింట్లో విఫలమైంది. బ్యాటింగ్‌‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో సత్తా చాటలేకపోతుంది. చివరి 2 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి 4-5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ఆ బలహీనతను బయటపెడుతోంది. ఇలా అయితే 300 కొట్టినా లాభం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News March 31, 2025

రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

image

సన్న బియ్యం పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలన్న CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. అయితే BRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ సర్కారు కొనసాగించాలని డిమాండ్ చేశారు. KCR బీసీ బంధు, దళితులకు రూ.పది లక్షలు వంటి పథకాలను ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. సంప్రదాయాలను KCR గౌరవించేవారని, ప్రస్తుతం ఉన్న సీఎం కూడా పాటించాలని హరీశ్ సూచించారు.

News March 31, 2025

బాపట్ల జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

image

బాపట్ల జిల్లాలో రంజాన్ సందడి మొదలైంది. ముస్లింల పరమ పవిత్రమైన రంజాన్ రోజు మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీ సంఖ్యలో మాంసం విక్రయం కోసం బారులు తీరారు. కాగా జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ధరలు అటూ ఇటుగా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి KG రూ.280 ఉండగా.. మటన్ కిలో ధర 800, నాటుకోడి ధర KG రూ.500గా ఉంది. నిన్న బాపట్ల సహా పలు ప్రాంతాల్లో KG రూ.180 ఉన్న చికెన్ ధర నేడు అమాంతం రూ.100కు పెరిగింది.

error: Content is protected !!