News October 3, 2024

ఈనెల 4న కలెక్టరేట్ ముందు ధర్నా

image

టీడీపీ కూటమి ప్రభుత్వ హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ 4న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఎం నగర నాయకులు అబ్దుల్ దేశాయ్, ఎస్ఎండీ షరీఫ్ కాజా పాషా పిలుపునిచ్చారు. కర్నూలు గడియారం హాస్పిటల్ వద్ద కార్మికులతో వారు మాట్లాడారు. తాము అధికారంలో వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

Similar News

News October 3, 2024

టెట్ పరీక్షకు 145 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 145 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. ఉదయం జరిగిన పరీక్షలో 551 మంది అభ్యర్థులు హాజరు కాగా.. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 556 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు.

News October 3, 2024

జాతీయ స్థాయి ప్లోర్ బాల్ పోటీలలో నంద్యాల జిల్లా పగిడ్యాలకు ద్వితీయ స్థానం

image

తమిళనాడులోని చెంగల్పట్టులో సెప్టెంబర్ 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి ప్లోర్ బాల్ పోటీలలో నంద్యాల జల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులం విద్యార్థినుల అఖిల, అక్షయ ద్వితీయ స్థానంలో నిలిచారనీ ఈమేరకు పీఈటీ లావణ్య వెల్లడించారు. దీంతో అఖిల, అక్షయను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.

News October 3, 2024

నంద్యాల జిల్లాలో హత్య.. అనుమానమే కారణం!

image

కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో హత్య జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు.. భార్య పార్వతిని భర్త రామమోహన్ గొడ్డలితో నరికి చంపాడు. వీరికి వివాహమై 16ఏళ్లు కాగా కొద్దిరోజులుగా భర్త భార్యకు దూరంగా ఉన్నాడు. ఇటీవల మళ్లీ ఆమె వద్దకు వచ్చిన ఆయన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడేవారు. ఇవాళ తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.