News May 3, 2024

ఈనెల 4 నుంచి బ్యాలెట్ ఓటు సౌకర్యం: కలెక్టర్ కాంత్రి

image

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలో గురువారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని చెప్పారు.

Similar News

News April 5, 2026

మెదక్: బాబు జగ్జీవన్ రామ్‌కు కలెక్టర్ నివాళులు

image

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక భూపతి రాజు, తహశీల్దార్ లక్ష్మణ్ బాబు ఉన్నారు.

News April 5, 2026

దళిత బంధు పథకం జగ్జీవన్ రామ్ ఆలోచనల ప్రతిఫలం: కేసీఆర్

image

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను స్మరించారు. సామాజిక న్యాయం, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి దేశ ప్రగతికి కృషి చేశారని పేర్కొన్నారు. దళిత సాధికారతకు దళిత బంధు వంటి పథకాలు ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే అమలవుతున్నాయన్నారు.

News April 5, 2026

జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

image

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తుండిపోతారన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.