News January 3, 2026
ఈనెల 5న జిల్లాలోని రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు: కలెక్టర్

ఈనెల 5న జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమాన్ని పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, మడకశిర, ధర్మవరం, పెనుకొండ డివిజన్ కేంద్రాలలో కార్యక్రమాన్ని RDOలు నిర్వహించాలన్నారు.
Similar News
News February 9, 2026
NZB: రేపు వీటికి సెలవు: కలెక్టర్

ఎన్నికల పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు 10న(మంగళవారం) సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ హాల్స్‌గా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు 12న (గురువారం), కౌంటింగ్ నిర్వహించబడే ఫిబ్రవరి 13న (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు.
News February 9, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 152 అర్జీలు

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 152 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పరిష్కార చర్యల నిమిత్తం బదిలీ చేశారు. పంచాయతీ రాజ్‌కు సంబంధించి అధిక అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2026
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: జేసీ ఇలక్కియా

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘PGRS’లో ప్రజల నుంచి 192 అర్జీలను స్వీకరించినట్లు JC ఇలక్కియా తెలిపారు. అందిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. అందిన అర్జీలలో 54 రెవెన్యూ సంబంధిత అంశాలు కాగా, మిగిలిన 138 నాన్-రెవెన్యూ కేటగిరీకి చెందినవని వివరించారు. పురపాలక, పోలీసు, DRDA, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు.


