News May 1, 2024
ఈనెల 6న తాండూరుకు ప్రియాంకా గాంధీ
ఈనెల 6న తాండూర్ పట్టణానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 6న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ మహేశ్ పాల్గొన్నారు.
Similar News
News January 12, 2025
HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం
ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.
News January 12, 2025
HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!
HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
News January 12, 2025
HYD: సంక్రాంతి స్పెషల్ బోర్డులు.!
బోడుప్పల్, KPHB, MGBS, JBS, కూకట్‌పల్లి కుషాయిగూడ ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం ముందస్తుగానే సంక్రాంతి స్పెషల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే వెంటనే సిటీ బస్సులను జిల్లా బస్సులుగా మార్చి, ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సిటీలో తిరిగే సర్వీసులకు అదనపు ఛార్జీలు లేవని, కేవలం జిల్లా స్పెషల్ సర్వీసులకే ఉన్నట్లు పేర్కొన్నారు.