News February 3, 2025

ఈనెల 6 మంత్రి ఫరూక్ సమీక్ష

image

రాష్ట్రంలో న్యాయశాఖ సంబంధించిన పాలనాపరమైన వివిధ అంశాలపై ఈనెల 6వ తేదీన సమీక్ష చేస్తున్నట్లు సోమవారం మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచి ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణ విషయంపై కూడా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించడం జరుగుతుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు.

Similar News

News February 3, 2025

ప్రైవేట్ స్కూళ్లపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం

image

AP: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

News February 3, 2025

రాచకొండ పోలీసులు అద్భుత ప్రతిభ.. సీపీ అభినందన

image

కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ పోలీస్‌ 3వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025లో రాచకొండ కమిషనరేట్ తరపున పాల్గొని పలు విభాగాల్లో బహుమతులు గెలుచుకున్న రాచకొండ అధికారులు, సిబ్బందికి ఈ రోజు నేరేడ్మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రీడల్లో మొత్తం 56 వ్యక్తిగత పతకాలతో పాటు ఉమెన్స్ కబడ్డీలో బంగారు పతకం, మెన్స్ కబడ్డీలో రాచకొండ పోలీసులు రజత పతకం సాధించారు.

News February 3, 2025

HYD: రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం

image

రాచకొండ కమిషనరేట్ ఐటీ సెల్ విభాగ అధికారులు, సిబ్బందితో ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ సెల్ సోషల్ మీడియా, సీసీటీఎన్ఎస్, కోర్ టీమ్, సీఈఈఆర్, ప్రజావాణి ఫిర్యాదుల వంటి పలు విభాగాల పనితీరును, ఫలితాల ప్రగతిని కూలంకషంగా పరిశీలించారు.