News December 2, 2024
ఈనెల 7న గుంటూరులో ఫ్లాగ్ డే: కలెక్టర్
ఈనెల 7వ తేదీన గుంటూరులో ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన స్టిక్కర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ విరాళాలు దేశ భద్రత కోసం అసువులు బాసిన వీర జవానుల కుటుంబ సభ్యులకు ఎంతో కొంత తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News December 26, 2024
గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి
రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.
News December 26, 2024
కొల్లూరు: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్
పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లింది. పృథ్వీరాజ్ అనే వ్యక్తి RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లైయి పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 26, 2024
కొల్లూరు: ట్రాక్టర్ కొనివ్వలేదని సూసైడ్
ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్లూరు మండలం సగ్గునలంకలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సగ్గునలంకకు చెందిన మణికంఠ ట్రాక్టర్ కొనివ్వాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వారు ఒప్పుకోకపోవడంతో 20వ తేదీన మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగాడు. కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.