News October 3, 2025
ఈనెల 7న నారావారిపల్లెకు CM

ఈనెల 7న సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు రానున్న సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు విస్తరి కార్యక్రమం ఈనెల 7వ తేదీన నారావారిపల్లెలో జరగనుంది. కాగా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నారావారిపల్లికి రానున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
Similar News
News October 3, 2025
‘భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం’

భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ముందుకెళ్లాలని సింగరేణి ఏరియా మేనేజర్ ఏ.రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 100 మిలియన్ టన్నులు సాధించే దిశగా ఏరియాలో, సంస్థలో చేపట్టాల్సిన కొత్త ఆవిష్కరణలపై చర్చించారు.
News October 3, 2025
విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిందా?

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.
News October 3, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓తెలంగాణ జాగృతి భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా వీరన్న
✓భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి
✓ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు: పినపాక తాహశీల్దార్
✓సారపాకలో దంచి కొట్టిన వర్షం
✓స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: BRS జిల్లా అధ్యక్షుడు రేగా
✓కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి: KVPS
✓భద్రాద్రి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు: ఎంపీ
✓పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే