News December 30, 2025
ఈరోజు అస్సలు చేయకూడని పనులు

ఈ రోజున తులసి మొక్కను తాకడం, ఆకులు కోయడం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘పూజకు కావాల్సిన తులసిని ముందు రోజే కోసి ఉంచుకోవాలి. అన్నం/బియ్యంతో తయారైనవి అస్సలు తినకూడదు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. పగలు నిద్రించడం వల్ల పుణ్యఫలం తగ్గుతుంది. ఎవరినీ దూషించకూడదు. గొడవలు పడకూడదు. ప్రతికూల ఆలోచనలు వీడి, మనసును పూర్తిగా ఆ శ్రీహరి నామస్మరణపైనే లగ్నం చేయాలి’ అంటున్నారు.
Similar News
News December 30, 2025
తిరుమలలో రద్దీ.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

✱TTD హెల్ప్‌లైన్(టోల్ ఫ్రీ): 155257
✱విచారణ కార్యాలయం: 0877-2277777
✱అశ్విని ఆసుపత్రి (తిరుమల): 0877-2263457 / 2263458
✱అంబులెన్స్ సేవలు: 0877-2263666(నేరుగా 108కి కాల్ చేయొచ్చు)
✱మెయిన్ హాస్పిటల్ (తిరుపతి): 0877-228777
✱విజిలెన్స్ ఆఫీస్ (TTD Security): 0877-2263333
✱తిరుమల క్రైమ్ పార్టీ: 0877-2263939
✱తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్: 0877-2263833
✱ట్రాఫిక్ పోలీస్ స్టేషన్: 0877-2263733
News December 30, 2025
రాష్ట్రంలో 198 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

TGSRTCలో 198 ట్రాఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి TGPRB దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా, BE, బీటెక్ అర్హతగల వారు నేటి నుంచి JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఫిజికల్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 30, 2025
ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రాకుండా ఉండాలంటే..

ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు. ముందునుంచే ఫిట్స్ ఉంటే గర్భం దాల్చిన తర్వాత న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించాలి. లేకపోతే ఈ సమయంలో ఫిట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఫిట్స్‌కు వాడే మందులు గర్భంతో ఉన్నప్పుడు కొందరు మానేస్తూ ఉంటారు. ఇలా చేస్తే తల్లితో పాటు బిడ్డకి కూడా ప్రమాదమే.. కాబట్టి డాక్టర్ సూచనలతో బిడ్డకు హాని కలిగించని మందులను మాత్రమే వాడాలి.


