News October 12, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: అక్టోబర్ 12, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:18 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:56 గంటలకు
ఇష: రాత్రి 7.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 28, 2026
ఫ్లైట్ క్రాష్‌లలో చనిపోయిన ప్రముఖులు.. (2/2)

2004లో BJP ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బెంగళూరు హెలికాప్టర్ ప్రమాదంలో నటి సౌందర్య, 2005లో హరియాణా మంత్రి, వ్యాపారవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ చనిపోయారు. 2009 SEPTలో ఉమ్మడి AP CM రాజశేఖర్ రెడ్డి నల్లమల పావురాలగుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఇక 2021లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ TNలో హెలికాప్టర్ క్రాష్‌లో, 2025లో ఎయిరిండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిచెందారు.
News January 28, 2026
నేషనల్ ఫిజికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని CSIR-నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ 18 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 9 వరకు పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.72,240 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nplindia.in
News January 28, 2026
విగ్రహమొక్కటే.. దేవుళ్లెందరో!

అనంతపురం(D) పంపనూరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. విజయనగర రాజగురువు వ్యాసరాజు ప్రతిష్టించిన ఇక్కడి విగ్రహం ఒకేచోట శివకుటుంబాన్ని, విష్ణుతత్వాన్ని ప్రదర్శిస్తుంది. విగ్రహంలో శివలింగం, శ్రీచక్రం, సప్తశిరస్సుల పాముతో పాటు గణపతి, నరసింహస్వామి కూడా ఉంటారు. ఇక్కడ 9/11 మంగళవారాలు ప్రదక్షిణలు చేస్తే నాగ, రాహుకేతు, కాలసర్ప దోషాలు తొలగి సంపద, సంతానం, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని నమ్మకం.


