News November 8, 2025

ఈరోజు మీకు సెలవు ఉందా?

image

AP: మొంథా తుఫాను సమయంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని DEOలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నేడు విశాఖ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. కర్నూలు, నంద్యాల, NTR, కడప, ప.గో, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరి మీ ప్రాంతంలో స్కూల్ ఉందా? COMMENT

Similar News

News November 8, 2025

బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

image

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్‌లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.

News November 8, 2025

కేశాలకు కర్పూరం

image

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

News November 8, 2025

ఎంత కాలం రెంట్‌కి ఉన్నా ఓనర్లు కాలేరు: సుప్రీం

image

‘ది లిమిటేషన్ యాక్ట్-1963’ ప్రకారం 12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకే కొందరు తమ టెనంట్లను ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఈక్రమంలో యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అద్దెకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పొందలేరని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టు తొలుత టెనంట్ పక్షాన నిలువగా.. సుప్రీం ఈ గందరగోళానికి ముగింపు పలికింది.