News March 24, 2024

ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో, భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిరంగిపురంలో వీవీ ప్యాట్‌లను కూడా పరిశీలించారు.

Similar News

News December 30, 2025

తెనాలి: పోక్సో కేసులో నిందితుడికి జైలు, జరిమానా.!

image

ప్రేమ పేరుతో బాలికను వేధించిన కేసులో నిందితుడికి 2 ఏళ్ల జైలు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తెనాలి ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సుల్తానాబాద్‌‌లో 14 ఏళ్ల బాలికను 22 ఏళ్ల తమ్మిశెట్టి వినయ్‌ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయగా బాలిక తల్లి 2022 మే 2న త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం కేసు విచారించిన పోక్సో స్పెషల్ కోర్ట్ న్యాయమూర్తి సాక్షాదారాలను పరిశీలించి నిందితుడికి జైలు జరిమానా విధించారు.

News December 30, 2025

గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్లకు భారీ డిమాండ్

image

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.

News December 30, 2025

GNT: ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ నిర్వహించిన కలెక్టర్

image

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంను నిర్దేశిత లక్ష్యాలకు మేరకు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ చేపట్టారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలు పాల్గొన్నారు.