News January 27, 2025
ఈవీఎం కేంద్రాన్ని పరిశీలించిన సత్యసాయి కలెక్టర్

ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం కేంద్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం ధర్మవరం ఆర్డీఓ మహేశ్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎం కేంద్రం చుట్టుపక్కల భద్రతను అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News March 13, 2025
17, 18న అంగన్వాడీల ధర్నాలు జయప్రదం చేయాలి: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటల పాటు కలెక్టరేట్ ముందు నిర్వహించి ధర్నాలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి కోరారు. సంగారెడ్డిలో ధర్నా కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంగన్వాడీలు ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News March 13, 2025
దస్తగిరికి భద్రత పెంపు

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరికి ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉండగా ఇకపై 2+2కు గన్‌మెన్లను కేటాయించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని ఆయన ఇటీవల విన్నవించారు. దీంతో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
News March 13, 2025
నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

రేపు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 6గంటలకు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన జాతరలో పాల్గొని పార్వతీపరమేశ్వరులకు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమనగల్ నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.