News December 27, 2025

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి: అనంత కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ఠమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా చర్యలను, లాక్‌బుక్‌లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News February 15, 2026

కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈనెల 16న అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించబడుతుందన్నారు. అర్జీదారులు అవసరమైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

News February 14, 2026

ముచ్చటగా మూడోసారి..

image

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఒటాన్ అకౌంట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన 2026-27 ఆర్థిక సంవత్సరానికి శనివారం ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి-సంక్షేమానికి సమతూకం కల్పించేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. సీఎం మార్గనిర్దేశంతో, పది రోజుల ప్రీ-బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ బడ్జెట్ సిద్ధమైంది.

News February 14, 2026

అనంతపురం జిల్లాకు బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠ

image

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం విశేషం. జిల్లాకు చెందిన మంత్రి కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కీలక ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.