News August 29, 2025
ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా: పవన్

ఈసారి విశాఖ వస్తే మీ ఇంట్లోనే నిద్ర చేస్తా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కార్యకర్తను ఉద్ధేశించి మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. కార్యకర్తల ఇంటిలో ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలను తెలుసుకోవాలని గాజువాకకు చెందిన జనసేన కార్యకర్త సురేశ్ కుమార్ పవన్‌ను కోరారు. ఈ ఆలోచన నచ్చడంతో ఈసారి విశాఖ వస్తే సురేశ్ ఇంట్లోనే నిద్ర చేస్తానంటూ నిన్న జరిగిన సమావేశం అనంతరం పవన్ అన్నారు.
Similar News
News August 29, 2025
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. శుక్రవారం కోస్టల్ బ్యాటరీ వద్దకు హెలిపాడ్‌లో చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం నోవాటెల్‌కు బయలుదేరి వెళ్లారు.
News August 29, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాడబలిజ మత్స్యకారులు, ప్రమాద బాధితులు, ఉద్యోగం కోరిన దివ్యాంగులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక సమస్యలు వివరించిన పౌరుల అభ్యర్థనలను విని మంత్రి స్పందించారు.
News August 29, 2025
ఆరిలోవ: నడిరోడ్డుపై నిప్పంటిచుకున్నాడు

విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.