News January 29, 2026
ఈసారి ₹3.5 లక్షల కోట్లతో బడ్జెట్!

AP: FY26-27కి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. పెద్దఎత్తున పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు వస్తుండడమే దీనికి కారణం. Fy25-26లో బడ్జెట్ ₹3,22,359.33cr కాగా ఈసారి ₹3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో ₹48,341cr కాగా ఈసారి ₹60000crకు పెరుగుతుందని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు FEB 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News February 16, 2026
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం నుంచి రూ.564 కోట్లు!

TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బకాయిల విడుదలకు కేంద్రం ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ అధికారులు ఢిల్లీ వెళ్లగా రూ.564 కోట్ల రిలీజ్‌కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా 60వేల పంపిణీ పూర్తయింది. మరో 30వేలు పంపిణీకి సిద్ధమవ్వగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నిధులు ఇస్తే నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముంది.
News February 16, 2026
కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.
News February 16, 2026
ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

<


