News March 31, 2026

ఈసారీ సత్తా చాటుతారా?

image

ఈ ఐపీఎల్ సీజన్‌లో GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్, PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల ప్రదర్శనపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 175 స్ట్రైక్ రేటుతో అయ్యర్ లాస్ట్ సీజన్‌లో 604 రన్స్ చేయగా గిల్ 155 స్ట్రైక్ రేటుతో 650 పరుగులు చేశారు. ఇటీవల T20WCలో చోటు దక్కకపోవడంతో ఈ సీజన్‌లో రాణించి జట్టులో చోటు దక్కించుకోవాలని గిల్, అయ్యర్‌లు ఆశిస్తున్నారు.

Similar News

News April 13, 2026

మోనాలిసా కేసు.. భర్తకు హైకోర్టులో ఊరట

image

కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మైనరైన ఆమెను కిడ్నాప్ చేశారంటూ నమోదైన కేసులో భర్త ఫర్మాన్ ఖాన్‌కు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. మే 20 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా మోనాలిసా మైనర్ అని NCST నిర్ధారించడంతో భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు కొన్ని రోజులుగా మోనాలిసా కనిపించట్లేదని భర్త నిన్న <<19631395>>సెల్ఫీ వీడియో<<>> రిలీజ్ చేశారు.

News April 13, 2026

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్స్.. ఈసీ, కేంద్రానికి SC నోటీసులు

image

ఎన్నికల నిర్వహణపై ఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టాలంటూ BJP నేత అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. అమలుపై తమ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని, భవిష్యత్తులో అమలుకు వ్యవస్థలన్నీ కలిసి పనిచేయాలని SC పేర్కొంది.

News April 13, 2026

రామ్ చరణ్ అదిరిపోయే లుక్!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ తన ఏప్రిల్ కవర్ పేజీపై చరణ్‌ ఫొటోను ప్రచురించింది. డార్క్ బ్లూ కోటులో లాంగ్ హెయిర్‌తో చేతిలో కుక్కపిల్లను పట్టుకుని ఉన్న ఆయన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఈ మ్యాగజైన్ ఆయన్ను అభివర్ణించింది. హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఈ ఫొటోషూట్ లుక్ SMలో వైరల్ అవుతోంది.