News March 8, 2025

ఈస్ట్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన అంకిత్ కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీగా అంకిత్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈరోజు ఉదయం ఈస్ట్ జోన్ కార్యాలయాన్ని చేరుకున్న అంకిత్ కుమార్.. డీసీపీ రవీందర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ పరిధిలోని అధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు.

Similar News

News November 8, 2025

సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా గజవాడ వేణు

image

వేములవాడకు చెందిన జడ్జి గజవాడ వేణు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మిర్యాలగూడ 5వ అదనపు న్యాయమూర్తి, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జి, హైదరాబాద్ 6వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 20వ ముఖ్య న్యాయాధికారిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

News November 8, 2025

చిత్తూరు, తిరుపతి జిల్లాలో నేటి ముఖ్యమైన కార్యక్రమాలు

image

☞ కుప్పం నియోజకవర్గంలో నేడు 7 కంపెనీలకు వర్చువల్‌గా<<18223647>> CM చంద్రబాబు శంకుస్థాపన<<>>
☞ రూ.2,203 కోట్ల పెట్టుబడులతో 22 వేల మందికి ఉపాధి
☞ నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న Dy.CM పవన్
☞ ఉదయం 8.05 రేణిగుంటకు వచ్చి అక్కడి నుంచి మామండూరు అటవీ క్షేత్రం చేరుకుంటారు
☞ ఉదయం 11 గంటలకు మంగళం రోడ్డులోని రెడ్ శాండిల్ గోడౌన్ తనిఖీ
☞ నేడు మధ్యాహ్నం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్న పవన్

News November 8, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు న్యాయమూర్తుల బదిలీ

image

కరీంనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఆర్ శ్రీలతను సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా డీఎల్ఎస్ఏ సెక్రటరీ కే.వెంకటేష్‌ను మేడ్చల్ మల్కాజిగిరి ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టుకు, పెద్దపల్లి డీఎల్ఎస్ఏ కే.స్వప్నరాణిని పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్, పోక్సో కోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు.