News March 23, 2024

ఈ ఎన్నికల్లో సర్వేపల్లి ప్రత్యేకత ఇదే.!

image

సర్వేపల్లి నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్యే పోరు జరగనుంది. 2014, 19 ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఇలా పాత ప్రత్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం లేకుండాపోయింది. ఒక్క సర్వేపల్లి అభ్యర్థులకే ఆ అవకాశం దక్కింది.

Similar News

News November 3, 2025

నెల్లూరు జైలుకు జోగి రమేష్‌ తరలింపు

image

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్‌, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.

News November 3, 2025

ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

image

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్‌లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.

News November 3, 2025

నెల్లూరు: 1,282.63 హెక్టార్లలో పంటకు నష్టం

image

తుపాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 79,333 హెక్టార్లలో వరి సాగు చెయ్యగా 1282.63 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుసెనగ 11.4 హెక్టార్లు, మొక్క జొన్న 21.7 హెక్టార్లు, సజ్జ పంటకు 5 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.