News January 3, 2026
ఈ ఏడాదిలో 835 అగ్ని ప్రమాదాలు.. REPORT

2025కు సంబంధించిన అగ్ని ప్రమాదాల నివేదిక వెలువడింది. ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాలు పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 835 అగ్ని ప్రమాదాలు జరగగా రూ.32 కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. GHMC పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Similar News
News February 16, 2026
తిరుపతి: LRS గడువు ఎప్పటివరకు పొడిగించారో తెలుసా…!

అనాధికారిక భవన నిర్మాణాలకు సంబంధించి LRS దరఖాస్తుల గడువు ఏప్రిల్ 23 వరకు పొడిగించారు. ఇప్పటివరకు 968 దరఖాస్తులు రాగా 135 పూర్తి అయ్యాయి. ఇక BPS కి సంబంధించి 1000 నోటీసులు తిరుపతి కార్పొరేషన్ ఇవ్వగా 1322 దరఖాస్తులు వచ్చాయి.. 262 పూర్తి చేశారు. సుమారు 2500 వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య కోరారు.
News February 16, 2026
అమరావతి: సచివాలయంలో సీఎంతో బిల్ గేట్స్ భేటీ

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ చేరుకున్నారు. గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌కు మంత్రులను పరిచయం చేశారు. అనంతరం ఆయన రియల్ టైం గవర్నెన్స్‌ను పరిశీలిస్తున్నారు.
News February 16, 2026
రూ.75వేల జీతంతో AERAలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(AERA)లో 3డేటా అనలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in


