News December 20, 2025
ఈ కలుపు మందులతో వయ్యారిభామ నిర్మూలన

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.
Similar News
News December 20, 2025
అశాంతి రేపుతున్న ‘నోబెల్ శాంతి దూత’

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్‌లో అల్లర్లు నిత్యకృత్యమయ్యాయి. పాలనపై పట్టులేకపోవడంతో పట్టాలు తప్పిన రైలులా ఆ దేశం పయనిస్తోంది. <<18615317>>హిందువుల<<>> హత్యలు, దేవాలయాలపై దాడులు, భారత వ్యతిరేక ప్రదర్శనలు పెరిగిపోతున్నా ఆయన మిన్నకుండిపోతున్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలూ మొదలయ్యాయి. ఇవన్నీ పాక్‌తో బంధం కోసమేననే ఆరోపణలున్నాయి. మరి ఆయన ఎన్నాళ్లు మనుగడ సాధిస్తారో?
News December 20, 2025
ఆ ఎమ్మెల్యేలు BRS భేటీకి వస్తారా?

TG: తాము INCలో చేరలేదని ఐదుగురు BRS MLAలు నివేదించడంతో వారిపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే KCR ఆధ్వర్యంలో రేపు BRS కార్యవర్గం, LPల భేటీ జరగబోతోంది. పార్టీలోనే ఉన్నామని పేర్కొన్న ఆ MLAలు T.వెంకటరావు, A.గాంధీ, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలు ఈ భేటీకి హాజరవుతారా? కారా? అన్నది ఆసక్తిగా మారింది. మిగతా సభ్యులు యాదయ్య, పోచారం, సంజయ్, నాగేందర్, కడియం రాక పైనా చర్చ సాగుతోంది.
News December 20, 2025
రబీ వరి సాగు.. ఎప్పటిలోగా విత్తుకోవాలి

APలో కొన్నిచోట్ల ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోతలు పూర్తైన భూముల్లో 125 రోజుల కాలపరిమితి గల వరి రకాలను ఇప్పటికే నాటుకోవాలి. ఒకవేళ ఎద పద్ధతిలో సాగు చేయాలనుకుంటే డిసెంబర్ 31 లోపు విత్తు కోవాలి. ఖరీఫ్ పంటకోత మరీ ఆలస్యమైతే 120 రోజుల కాల పరిమితి వరి రకాలను జనవరి మొదటి వారంలోపు ఎద పద్ధతిలో వేసుకోవాలి. దీని వల్ల రబీ వరి కోతలను ఏప్రిల్ 10లోపు పూర్తి చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


