News March 29, 2025

ఈ-కేవైసీ చేయకపోతే రేషన్ ఆగిపోతుంది: DSO

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయకపోతే మే 1వ తేదీ నుంచి రేషన్ నిలిపేస్తామని DSO కోమలి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ కార్డు దారులు ఏప్రిల్ చివరి వరకు ఈ-కేవైసీ చేయించుకోవచ్చన్నారు. మొత్తం జిల్లాలో 5.99 లక్షల కార్డులు ఉండగా.. ఇప్పటి వరకు 4.70 లక్షల మంది ఈ-కేవైసీ అప్డేట్ చేయించారన్నారు. మిగిలిన వారు కూడా ఈ-కేవైసీ పూర్తి చేయించాలన్నారు. 

Similar News

News March 31, 2025

జనసేనపై అంబటి రాంబాబు ట్వీట్

image

జనసేనపై మరోసారి మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తనదైన శైలిలో ట్విటర్‌లో విమర్శలు చేశారు. ‘బాబుకు సుత్తి కొట్టడమే.. సత్తా లేని జనసేన పని.!’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ పని చేసినా, దానిని గుడ్డిగా సమర్థించడమే పవన్ కళ్యాణ్‌కు పనిగా మారిందని కొంతమంది కామెంట్లు చేయగా, అంబటి రాంబాబును విమర్శిస్తూ మరి కొంతమంది ఆ ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్నారు. 

News March 31, 2025

గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 

News March 31, 2025

ఫిరంగిపురం: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

image

ఫిరంగిపురంలో పిల్లల్ని సవతి తల్లి లక్ష్మి కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కాగా కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.

error: Content is protected !!