News December 3, 2025

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

image

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్‌లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్‌ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్‌ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

Similar News

News December 3, 2025

గాన గంధర్వుడి విగ్రహంపై వివాదం.. మీరేమంటారు?

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును పలువురు <<18452414>>అడ్డుకోవడంపై<<>> నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఎస్పీ బాలు ప్రాంతాలకు అతీతం అని, అలాంటి గొప్పవారి విగ్రహాన్ని అడ్డుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాలు తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 3, 2025

49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌‌లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://socialjustice.gov.in

News December 3, 2025

కోటి మంది ఫాలోవర్లను కోల్పోయాడు

image

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో X(ట్విటర్)లో 10 మిలియన్ల(కోటి) ఫాలోవర్లను కోల్పోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. నవంబర్‌లో 115M ఫాలోవర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 105Mకు చేరింది. దీనికి ప్రధాన కారణం ఫేక్ అకౌంట్ల తొలగింపేనని తెలుస్తోంది. అటు NOV 18న ట్రంప్‌తో రొనాల్డో భేటీ ప్రభావం చూపించి ఉండొచ్చని సమాచారం. ట్రంప్ అంటే నచ్చని వారికి వారి మీటింగ్ కోపం తెప్పించిందని తెలుస్తోంది.