News January 14, 2026

ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

image

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.

Similar News

News January 28, 2026

‘అజిత్’ రాజకీయ వారసులు ఎవరు?

image

మహారాష్ట్ర Dy CM అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది. కుమారుడు పార్థ్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ MP) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బారామతి టెక్స్‌టైల్ కంపెనీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సునేత్ర గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ NCP నుంచి విడిపోయి అజిత్ BJP-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే. కాగా వారసుల నిర్ణయాలు MH ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

News January 28, 2026

కడప జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

AP: <>కడప<<>> జిల్లాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీ& హాస్పిటల్ 9 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MDS అర్హత గలవారు ఫిబ్రవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పీజీ మెరిట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 44ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.2000, BC, SC, STలకు రూ.1000. నెలకు జీతం రూ.74,750 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

News January 28, 2026

‘పాక్.. మేం రెడీగా ఉన్నాం’.. ఐస్‌ల్యాండ్ ట్రోల్

image

T20 WCను బాయ్‌కాట్ చేస్తామని <<18966853>>బెదిరిస్తున్న<<>> పాకిస్థాన్‌ను ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు ట్రోల్ చేసింది. పాక్ ప్లేస్‌లో తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. ‘WCలో పాక్ ఆడుతుందో లేదో త్వరగా చెబితే బాగుంటుంది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగిన వెంటనే మేం బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఫిబ్రవరి 7న సరైన సమయానికి కొలంబోకు చేరుకోవడం కష్టమవుతుంది’ అంటూ రాసుకొచ్చింది.