News November 5, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల లోపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, MBNR, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?
Similar News
News April 1, 2026
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల దీనిపై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో ధర పెరుగుతోంది.
News April 1, 2026
రేషన్ కార్డులు ఉన్నవారికి భారీ శుభవార్త

దేశవ్యాప్తంగా నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ను పంపిణీ చేశారు.
News April 1, 2026
కస్టమర్లకు ఈరోజు బ్యాంక్ సేవలు దూరం

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఈరోజు బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఈరోజు బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. రేపు యథావిధిగా బ్యాంకులు కొనసాగనుండగా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎల్లుండి మళ్లీ సెలవు ఉంటుంది.


