News December 19, 2024
ఈ నెలాఖరున అరకు ఉత్సవం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరున అరకు ఉత్సవంను నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. అరకు ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మూడు రోజులుపాటు అరకు ఉత్సవాన్ని విజవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆధికారులకు సూచించారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
Similar News
News January 9, 2026
విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 9, 2026
విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.
News January 9, 2026
ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.


