News December 23, 2025
ఈ నెలాఖరు నుంచి ఫ్యామిలీ సర్వే

AP: ఈ నెలాఖరు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(UFS) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపింది. ‘అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడం, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడం ఈ సర్వే ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్ల జారీ సులభతరమవుతుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లదు’ అని పేర్కొంది.
Similar News
News February 21, 2026
మార్కెట్లో కల్తీ పాలే ఎక్కువ!

రోజూ తాగే పాలు నాణ్యమైనవేనా? అంటే సందేహించాల్సిందే! దేశవ్యాప్తంగా పరీక్షించిన ప్రతి 3 శాంపిల్స్‌లో ఒకదాంట్లో కల్తీ జరిగినట్లు తేలుతోంది. గతేడాది ప్రతి 100 శాంపిళ్లలో 38 నమూనాలు టెస్టుల్లో ఫెయిలయ్యాయి. పాలల్లో డిటర్జెంట్లు, యూరియా వంటివి కలుపుతున్నారు. ఇటీవల గుజరాత్‌లో బయటపడిన <<19076004>>డెయిరీ ఉదంతమే<<>> ఇందుకు ఉదాహరణ. పదేళ్లలో మన దేశంలో పాల ఉత్పత్తి 63% పెరిగింది. అందులో ఒరిజినల్ <<19076364>>పాల శాతం<<>> ఎంతనేది దేవుడికెరుక.
News February 21, 2026
గాలి ఉండగానే తూర్పారబోయాలి

ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి రైతులు గాలి వచ్చే దిశలో ధాన్యాన్ని పై నుంచి కిందకు పోస్తారు. దీనినే తూర్పారబట్టడం అంటారు. గాలి బలంగా ఉన్నప్పుడు ఇది చాలా సులభంగా, వేగంగా పూర్తవుతుంది. గాలి లేనప్పుడు ప్రయత్నిస్తే పొట్టు సరిగా విడిపోదు, కష్టం వృథా అవుతుంది. జీవితంలో కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు లేదా గొప్ప అవకాశాలు ఎల్లప్పుడూ ఉండవు. అవి లభించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని ఈ సామెత చెబుతుంది.
News February 21, 2026
స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్!

TG: రాష్ట్రంలోని స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ సరఫరా చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించింది. స్టీమ్ రైస్‌తో విద్యార్థులకు అందించే ఫుడ్ నాణ్యత పెరుగుతుందని ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. దీనితో రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. మిల్లులో ఆడించకముందే ఆవిరితో ప్రాసెస్ చేయడం వల్ల స్టీమ్ రైస్ గింజలు విరగవు. అన్నం రుచిగా, పొడిగా ఉంటుంది.


