News December 7, 2024
ఈ నెల 10 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: తూ.గో కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News December 11, 2025
కందుల దుర్గేశ్‌కు 7వ ర్యాంకు

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
News December 11, 2025
తూ.గో. కలెక్టర్‌కు 13వ ర్యాంకు

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి IAS 711 ఫైళ్లు స్వీకరించి, 680 ఫైళ్లను పరిష్కరించారు. ఆమె సగటు ప్రతిస్పందన సమయం 1 రోజు 21 గంటల 12 నిమిషాలుగా ఉంది. ఈమె పనితీరు ఆధారంగా ఆమెకు 13వ ర్యాంకు కేటాయించారు.
News December 10, 2025
ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ

ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని.. ప్రతి సమాచారం రైతులకు, మీడియాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


