News April 8, 2025
ఈ నెల 10-14 వరకు కామారెడ్డిలో 163 సెక్షన్: SP

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10-14 వరకు 163 (BNSS) సెక్షన్ అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లాలో సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన ఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News April 17, 2025
SUPER.. గిన్నిస్ రికార్డ్ కొట్టిన నారాయణపేట అమ్మాయి

ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి, భరతనాట్యంలో ప్రతిభ చూపి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామానికి చెందిన జస్వితను బుధవారం నారాయణపేట సీవీఆర్ భవన్‌లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. చిరు ప్రాయంలోనే ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. పేరెంట్స్ పాల్గొన్నారు.
News April 17, 2025
ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు పాటించాలి: అదనపు కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
News April 17, 2025
వనపర్తి: సాయి బాలాజీ పాలి క్లినిక్ సీజ్: DMHO

నిబంధనలు పాటించకుండా నిర్వహించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి DMHO శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేశారు. అనుమతులు రెన్యువల్ చేయని సాయి బాలాజీ పాలి క్లినిక్‌ను సీజ్ చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీనివాసులు హెచ్చరించారు.