News July 7, 2025
ఈ నెల 13న ఓదెల మల్లన్న పెద్దపట్నం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పెద్దపట్నాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 13న స్వామి వారి పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గణపతి పూజ పుణ్యహవాచనము, మంటస్థాపన, శ్రీ వీరభద్రరాధన, రాత్రి 10 నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు అగ్నిగుండ ప్రజ్వలన, పెద్దపట్నం నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News July 7, 2025
NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
News July 7, 2025
వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.
News July 7, 2025
అరకు: ఈ నెల 10 సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరి

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10వతేదీన పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యండపల్లివలస APTWRJC(బాలికలు) ప్రిన్సిపాల్ అల్లు సత్యవతి తెలిపారు. కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుతుందని నేడు ఆమె తెలిపారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపల్ కోరారు.