News November 13, 2025
ఈ నెల 14న 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు

వనపర్తిలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జి గోవర్ధన్, కార్యదర్శి బి.వెంకటయ్య తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు సాగే వారోత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభిస్తారన్నారు. విద్యార్థిని, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
Similar News
News November 13, 2025
NZB: 25 మందికి రూ.18 లక్షల విలువైన చెక్కులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. గురువారం NZB R&B గెస్ట్ హౌస్‌లో 25 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగా అందిస్తామన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి CMRF చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.
News November 13, 2025
పరిస్థితి తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: SC

ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.
News November 13, 2025
లడ్డూలతో రాజకీయం ఏంటి?: శ్రీవారి భక్తుల ఆగ్రహం

పవిత్రమైన <<18276380>>లడ్డూ ప్రసాదాన్ని<<>> చూపిస్తూ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ రాజకీయం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ధర్మారెడ్డి విచారణకు వచ్చిన సమయంలోనూ లడ్డూలు చూపించి పబ్లిసిటీ స్టంట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలోనే.. తిరుపతి ప్రెస్ క్లబ్లో లడ్డూలు, వడ ప్రసాదాలను బెంచిపై పెట్టి ప్రదర్శించారు. ఇలా లడ్డూలను ముందు పెట్టి రాజకీయం కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని పలువురు కోరుతున్నారు.


