News October 10, 2024
ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్
గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.
Similar News
News November 27, 2024
వినుకొండ: టీడీపీ నేత కోడలి చీర మిస్సింగ్.. నోటీసులు జారీ
ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్‌కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.
News November 26, 2024
IPLలో గుంటూరు కుర్రాడికి నిరాశ
IPL వేలం పాటలోకి గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన క్రీడాకారుడు వృథ్వీ రాజ్ యార్రాకు నిరాశ ఎదురైంది. ఇతడు గతంలో కేకేఆర్ జట్టుకు ఆడాడు. క్రికెట్లో మంచిగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సారి వృథ్వీ రాజ్ యార్రా IPLలో రూ.30,00,000 బెస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచాడు. అయితే అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
News November 26, 2024
రాజ్యాంగ హక్కులపై అవగాహన ఉండాలి: DEO
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాతబస్టాండ్ పరీక్షా భవన్లో పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సోమవారం డీఈవో బహుమతులు ప్రదానం చేశారు. ప్రతీ విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ ఖాశీం పాల్గొన్నారు.