News October 14, 2025

ఈ నెల 16న పాలమూరు వర్సిటీ స్నాతకోత్సవం

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో ఈ నెల 16న ‘4వ స్నాతకోత్సవం’ నిర్వహించనున్నట్లు ఉపకులపతి (వీసీ) ఆచార్య డాక్టర్ జి.ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ స్నాతకోత్సవంలో 83 బంగారు పతకాలు, 2,809 పీజీ, 8,291 ప్రొఫెషనల్, 18,666 యూజీ డిగ్రీలు, 12 పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నట్లు వీసీ వెల్లడించారు.

Similar News

News October 14, 2025

పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

image

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్‌గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్‌ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్‌‌ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్‌టర్మ్‌లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

News October 14, 2025

బద్దిపడగ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎమ్ సస్పెండ్

image

సి్ద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM పద్మను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్వీస్ నుంచి సస్పెండ్ చేశామని DEO తెలిపారు. జిల్లా కలెక్టర్ పాఠశాల సందర్శనలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడం, అమలు చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.

News October 14, 2025

దౌల్తాబాద్: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి’

image

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ మంగళవారం దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. హై స్కూల్‌ను సందర్శించి డ్రై డే చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పీహెచ్‌సీ, కస్తూర్బా హాస్టల్‌ను కూడా సందర్శించారు.