News November 11, 2024

ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్: మంత్రి సవిత

image

బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2 నెలల పాటు 5,200 మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేశారన్నారు. సీఎం సూచనలతో బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

Similar News

News November 22, 2024

నేడే పీఏసీ ఛైర్మన్ ఎన్నిక.. నామినేషన్ వేసిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే

image

శాసనసభలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. కాగా తాతయ్యతో పాటు NDA కూటమి నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. ఛైర్మన్‌తో పాటు PACలో మొత్తం 9 మంది సభ్యులను నేడు శాసనసభలో స్పీకర్ అయ్యన్న సమక్షంలో సభ్యులు ఎన్నుకుంటారు. 

News November 22, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. 25తో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA & MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 25లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది. 

News November 21, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 6,7,9, 10న బీఈడీ, డిసెంబర్ 6,7, 9,10,11,12న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ చూడాలని కోరింది.