News April 16, 2025

ఈ నెల 20న ఆదిలాబాద్‌కు మంత్రి సీతక్క 

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదివాసీ నేతలతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 1, 2025

భీంపూర్‌లో పులి సంచారం

image

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.

News November 1, 2025

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.

News November 1, 2025

ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

image

ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌‌ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్‌ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.