News February 14, 2025
ఈ నెల 20న కొండనాగులలో జాబ్ మేళా

బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు వచ్చే వారు 10th, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆధార్ కార్డు, పాస్ ఫొటోలు తీసుకురావాలన్నారు.
Similar News
News December 16, 2025
ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి?

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైనట్టు సమాచారం. ఇటీవల ఒంగోలులో జిల్లా అధ్యక్షుని ఎంపికపై పరిశీలకులు, నాయకుల అభిప్రాయాలను సేకరించారు. సామాజిక సమీకరణలతో పాటు వివిధ కోణాల్లో లోతుగా పరిశీలన చేసిన టీడీపీ అధిష్ఠానం ఉగ్రకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.
News December 16, 2025
వెంకటేశ్ అయ్యర్‌కు రూ.7 కోట్లు

IPL-2026 మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను RCB రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత మెగా వేలంలో ఇతడిని కోల్‌కతా రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసింది. దీంతో వేలానికి వచ్చిన అయ్యర్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు రూ.75 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆల్‌రౌండర్ దీపక్ హుడా అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News December 16, 2025
అసౌకర్యంగా అనిపిస్తుంది.. కాంతార ఇమిటేషన్‌పై రిషబ్ శెట్టి

కాంతార సీన్‌ను బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కామెడీగా <<18446778>>అనుకరించడం<<>>పై దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించారు. అలా చేయడం తనను అసౌకర్యానికి గురిచేస్తుందని రణ్వీర్ పేరెత్తకుండా చెప్పారు. ‘కాంతార దైవిక అంశాలతో రూపొందిన సినిమా. సున్నితమైన, పవిత్రమైన విషయం. దానితో మాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే మూవీ సన్నివేశాలను ఇమిటేట్ లేదా ఎగతాళి చేయవద్దని కోరుతుంటా’ అని ఓ ఈవెంట్లో పేర్కొన్నారు.


